రాష్ట్రంలోని బుడగ జంగాలను ఎస్సీల్లోకి చేర్చాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లక్షల మంది బుడగ జంగాలు ఉన్నారని... సంచార జీవనం గుడుపుతున్న వీరందరినీ పక్క రాష్ట్రాల్లో ఎస్సీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు.