సాక్షి, అమరావతి: గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో పల్లె ముంగిట్లోకే పాలన వచ్చిందన్నారు. గ్రామ సర్పంచ్‌లతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామాల్లో "జగనన్న స్వచ్ఛ సంకల్పం" అమలుపై చర్చించారు. జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రూ.1312.04 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సర్పంచ్‌లంతా గ్రామసచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా..
ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛసంకల్పానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ‘‘గ్రామ సర్పంచ్‌ల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మారుతాయి. ప్రజాప్రతినిధులుగా మీ ఎదుగుదలకు సర్పంచ్ పదవి తొలిమెట్టు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి. పట్టణాలకు ధీటుగా గ్రామాలను తీర్చిదిద్దాలి. ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలి. స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని’’ మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.
చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్
విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్
Comments
Please login to add a commentAdd a comment