కాంగ్రెస్‌తో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొత్తుపెట్టుకోవడం చూస్తే వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులు అన్నీ చంద్రబాబు కుట్రలో భాగమే అని అర్ధమవుతోందని వైఎస్సార్‌సీపీ అగ్రనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబుకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.