తిరుపతి వేదికగా సమర శంఖారావం సభ | YSRCP Samara Shankharavam Summit in Tirupati Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో సమర శంఖారావం సభ

Published Tue, Feb 5 2019 10:47 AM | Last Updated on Tue, Feb 5 2019 1:51 PM

YSRCP Samara Shankharavam Summit in Tirupati Tomorrow - Sakshi

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం ఉదయం తిరుపతి వేదికగా సమర శంఖారావం సభ జరగనుంది. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు ఈ సభలో పాల్గొననున్నారు. తిరుపతిలోని యోగానంద్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరగనున్న తటస్థుల సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహం ఒంటి గంటకు సమర శంఖారావం సభకు వైఎస్‌ జగన్‌ హాజరవుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement