
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మీడియా ప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబాలను ఆ దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ కోరారు. మీడియా రిపోర్టర్ మనోజ్ మృతి తీవ్రంగా కలచి వేసిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో నూ కరోనాపై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసే మీడియా ప్రతినిధులు కూడా కోవిడ్ వారియర్లేనని, వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్య లు చేపట్టాలన్నారు. నిన్న డాక్టర్లు, నేడు రిపోర్టర్లకు కరోనా సోకిందని, రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కరోనా కట్టడిపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఈనెల 9న తలపెట్టిన బీజే పీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరె న్స్ సమావేశం వాయిదా పడిందని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment