
న్యూఢిల్లీ:ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్(డబ్యూటీసీ) ఫైనల్ కోసం సన్నద్ధం అవుతున్న వేళ భారత్ కు గూడ్ న్యూస్ అందింది. ఐపీఎల్-14 వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న వృద్ధిమాన్ సాహా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పడు టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నాడు. వచ్చే నెలలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వృద్ధిమాన్ సాహా అందుబాటులో ఉండనున్నాడు.సూమారు మూడు వారాల పాటు ఢిల్లీ లో ఓ హాటల్‌లో క్వారంటైన్ వున్న సాహా సోమవారం ఇంటికి చేరుకున్నట్లు అతని సన్నిహితులు తెలిపారు.
ఇంగ్గాండ్‌కు బయలు దేరేముందు ముంబైలో టీంఇండియా కఠిన ఆంక్షల మధ్య బయో బబుల్‌లో ఉండనుంది.ఈ బయో బబుల్‌లో చేరడానికి ముందు సాహా మరో సారి RT-PCR పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. సౌతాంప్టన్‌లో జూన్ 18 నుంచి జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
(చదవండి:WTC Final: గెలుపే లక్ష్యం.. ఆ సిరీస్ కూడా గెలుస్తాం!)
Comments
Please login to add a commentAdd a comment