![Lucky Players Who Sold Last Minute IPL 2022 Mega Auction - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/14/safka.jpg.webp?itok=XHqr5ztK)
ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఆశ్చర్యంగా అసలు వేలంలో అమ్ముడుపోతారో లేదో అని అనుకున్న కొందరి ఆటగాళ్లను చివర్లో అదృష్టం వరించింది. వీళ్లది లక్ అనే చెప్పొచ్చు.
చదవండి: IPL 2022 Auction: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు అంత ధర.. ఎవరీ యష్ దయాల్
తొలి రోజు అమ్ముడుపోక రెండో రోజు చివర్లో మళ్లీ వేలానికి వచ్చిన వారిలో డేవిడ్ మిల్లర్‌కు రూ. 3 కోట్ల విలువ పలికింది. అప్పటి వరకు ఒక్క వికెట్ కీపర్‌ను కూడా తీసుకోని గుజరాత్ టైటాన్స్ వరుసగా వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్‌లను తీసుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా చివర్లో కోల్‌కతా బేస్‌ప్రైస్‌కే తీసుకోవడం ఊరట కలిగించింది. 333 టి20ల్లో ఏకంగా 146.35 స్ట్రయిక్‌రేట్‌తో 9,346 పరుగులు సాధించిన ఘనమైన రికార్డు ఉన్న అలెక్స్ హేల్స్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. కోల్‌కతా తక్కువ మొత్తానికే (రూ.కోటీ 50 లక్షలు) అతడిని దక్కించుకోగలిగింది. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ (బెంగళూరు; రూ. 2 కోట్లు) ఈ సీజన్ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు.
చదవండి: IPL 2022 Mega Auction: ఎవరీ షెపర్డ్.. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం!
Comments
Please login to add a commentAdd a comment