ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. కొందరికి జాక్‌పాట్ తగిలితే.. ఇంకొందరికి నామమాత్రపు ధర దక్కింది. కాగా వేలంలో ఈసారి విదేశీ క్రికెటర్ల కన్నా స్వదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తిని కనబరిచాయి. ఉదాహరణకు ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్ లాంటి ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలింది. అదే సమయంలో కొందరిని వేలంలో అసలు పట్టించుకోకపోవడం విశేషం. సురేశ్ రైనా, ఇయాన్ మోర్గాన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్ ఈ జాబితాలో ఉన్నారు.
చదవండి: Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్‌గా ఛాన్స్
ఇక వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు కొందరి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల ధరల్లోనూ హెచ్చుతగ్గులు ఉన్నాయి. రిటైన్ జాబితాలో ఉన్న కోహ్లి, ధోనిల ధర పడిపోగా.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల ధర అమాంతం పెరిగిపోయింది. వీరే కాదు.. గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్ రేసులో ఉన్న హార్దిక పాండ్యాతో రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్‌ల ధర భారీగా పెరిగింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఈ ముగ్గురిని రిటైన్ చేసుకోకముందు హార్దిక్ పాండ్యా ధర రూ. 11 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.15 కోట్లకు పెరిగింది. రషీద్ ఖాన్ ధర రూ.9 కోట్ల నుంచి రూ. 15 కోట్లు, శుభ్‌మన్ గిల్ ధర రూ.1.8 కోట్ల నుంచి రూ. 8 కోట్లకు పెరగడం విశేషం.
ఇక గత సీజన్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రిషబ్ పంత్ ధర భారీగా పెరిగింది. రిటైన్‌కు ముందు పంత్ ధర రూ. 8 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ. 16 కోట్లకు చేరడం విశేషం. ఇక సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ధర రిటైన్‌కు ముందు రూ. 15 కోట్లు ఉంటే.. ఆ తర్వాత రూ. 12 కోట్లకు తగ్గింది. అలాగే ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ధర రిటైన్‌కు ముందు రూ. 17 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.15 కోట్లుగా ఉంది. ఇంకా రిటైన్ జాబితాలో ఏయే ఆటగాడికి పెరిగింది.. తగ్గిందనేది ఒకసారి పరిశీలిద్దాం.
చదవండి: European Cricket: మాములు ప్రతీకారం మాత్రం కాదు.. 'అంతకు మించి'
చెన్నై సూపర్ కింగ్స్:
సీఎస్‌కే | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
జడేజా | రూ.7 కోట్లు | రూ.16 కోట్లు | రూ 9 కోట్లు పెరిగింది |
ధోని | రూ.15 కోట్లు | రూ.12 కోట్లు | రూ. 3 కోట్లు తగ్గింది |
మొయిన్ అలీ | రూ. 8 కోట్లు | రూ. 9 కోట్లు | రూ. కోటి పెరిగింది |
రుతురాజ్‌గైక్వాడ్ | రూ. 20 లక్షలు | రూ.6 కోట్లు | రూ. 5.8 కోట్లు పెరిగింది |
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
ఆర్‌సీబీ | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
విరాట్ కోహ్లి | రూ. 17 కోట్లు | రూ.15 కోట్లు | రూ. 2 కోట్లు తగ్గింది |
గ్లెన్ మ్యాక్స్‌వెల్ | రూ. 14.25 కోట్లు | రూ. 11 కోట్లు | రూ. 3.25 కోట్లు పెరిగింది |
మహ్మద్ సిరాజ్ | రూ. 2.6 కోట్లు | రూ. 7 కోట్లు |
రూ. 4.4 కోట్లు పెరిగింది |
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్ | రూ.1 కోటి | రూ.12 కోట్లు | రూ.11 కోట్లు పెరిగింది |
అర్షదీప్ సింగ్ | రూ. 20లక్షలు | రూ. 4 కోట్లు | రూ.3.8 కోట్టు పెరిగింది |
కోల్‌కతా నైట్‌రైడర్స్
కేకేఆర్ | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
ఆండ్రీ రసెల్ | 7 కోట్లు | 12 కోట్లు | రూ. 5 కోట్లు పెరిగింది |
వరుణ్ చక్రవర్తి | 4 కోట్లు | 8 కోట్లు | రూ. 4 కోట్లు పెరిగింది |
వెంకటేశ్ అయ్యర్ | 20 లక్షలు | 8 కోట్లు | రూ. 7.8 కోట్లు పెరిగింది |
సునీల్ నరైన్ | 8.5 కోట్లు | 6 కోట్లు | రూ.2.5 కోట్లు తగ్గింది |
సన్‌రైజర్స్ హైదరాబాద్
ఎస్‌ఆర్‌హెచ్ | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
కేన్ విలియమ్సన్ | రూ.3 కోట్లు | రూ.14 కోట్లు | రూ.11 కోట్లు పెరిగింది |
అబ్దుల్ సమద్ | 20 లక్షలు | రూ. 4 కోట్లు | రూ.3.8 కోట్లు పెరిగింది |
ఉమ్రాన్ మలిక్ | 10 లక్షలు | రూ. 4 కోట్లు | రూ. 3.9 కోట్లు పెరిగింది |
ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
రోహిత్ శర్మ | 15 కోట్లు | 16 కోట్లు | రూ. కోటి పెరిగింది |
బుమ్రా | 7 కోట్లు | 12 కోట్లు | రూ. 5 కోట్లు పెరిగింది |
సూర్యకుమార్ | 3.2 కోట్లు | 8 కోట్లు | రూ. 5.4 కోట్లు పెరిగింది |
పొలార్డ్ | 5.4 కోట్లు | 6 కోట్లు | రూ. 60 లక్షలు తగ్గింది |
రాజస్తాన్ రాయల్స్
రాజస్తాన్ రాయల్స్ | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
సంజు సామ్సన్ | రూ. 8 కోట్లు | రూ.14 కోట్లు | 6 కోట్లు పెరిగింది |
జాస్ బట్లర్ | రూ. 4.4 కోట్లు | రూ.10 కోట్లు | రూ. 3.6 కోట్లు పెరిగింది |
యశస్వి జైస్వాల్ | రూ. 2.4 కోట్లు | రూ. 4 కోట్లు | రూ. 1.6 కోట్లు పెరిగింది |
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
హార్దిక్ పాండ్యా | రూ.11 కోట్లు | రూ.15 కోట్లు | రూ. 4 కోట్లు పెరిగింది |
రషీద్ ఖాన్ | రూ. 9 కోట్లు | రూ.15 కోట్లు | రూ. 6 కోట్లు పెరిగింది |
శుబ్‌మన్ గిల్ | రూ. 1.8 కోట్లు | రూ.8 కోట్లు | రూ. రూ. 6.2 కోట్లు పెరిగింది |
లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్‌జెయింట్స్ | 2021 ధర | 2022 ధర | పెరిగింది/తగ్గింది |
కేఎల్ రాహుల్ | రూ.11 కోట్లు | రూ.16 కోట్లు | రూ.5 కోట్లు పెరిగింది |
రవి బిష్ణోయ్ | 2 కోట్లు | రూ.4 కోట్లు | రూ. 2 కోట్లు పెరిగింది |
మార్కస్ స్టోయినిస్ | 4.8 కోట్లు | రూ.9.2 కోట్లు | రూ. 4.4 కోట్లు పెరిగింది |
Comments
Please login to add a commentAdd a comment