ఐపీఎల్ మెగావేలంలో ఆర్‌సీబీ రెండురోజుల పాటు ఉత్సాహంగా పాల్గొంది. తొలిరోజు వేలంలోనే ఆర్‌సీబీ దాదాపు ప్రధాన ఆటగాళ్లపై మొగ్గు చూపి వేలంలో దక్కించుకుంది. గతేడాది టాప్ వికెట్ టేకర్ హర్షల్‌పటేల్‌ను రూ .10. 75 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్‌సీబీ.. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగాను కూడా అదే ధర వద్ద దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత హాజిల్‌వుడ్, డుప్లెసిస్‌ను మంచి ధర దక్కింది. ఇక దినేశ్ కార్తిక్‌ను రూ. 5.50 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం కాస్త ఆశ్చర్యపరిచింది.
చదవండి: IPL 2022 Mega Auction: శార్దుల్ ఠాకూర్‌కి రూ. 10.75 కోట్లు.. ఢిల్లీ జట్టు ఇదే
రిటైన్ జాబితాలో విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌తో పాటు సిరాజ్ ఉన్నారు. అయితే గత సీజన్‌లో కెప్టెన్‌గా కోహ్లి పక్కకు తప్పుకోవడంతో ఈ సీజన్‌లో కెప్టెన్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆర్‌సీబీ మొత్తం ఆటగాళ్ల సంఖ్య 22 మంది కాగా.. అందులో 14 మంది భారత క్రికెటర్లు కాగా.. మిగతా 8 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. రిటైన్ జాబితా మినహాయించి వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం రూ.88 కోట్ల 45 లక్షలు ఖర్చు చేసింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ):
విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు
మ్యాక్స్‌వెల్: రూ. 11 కోట్లు
హర్షల్ పటేల్: రూ. 10 కోట్ల 75 లక్షలు
హసరంగ: రూ. 10 కోట్ల 75 లక్షలు
హాజెల్‌వుడ్: రూ. 7 కోట్ల 75 లక్షలు
సిరాజ్ : రూ. 7 కోట్లు
డు ప్లెసిస్: రూ. 7 కోట్లు
దినేశ్ కార్తీక్: రూ. 5 కోట్ల 50 లక్షలు
అనూజ్ రావత్: రూ. 3 కోట్ల 40 లక్షలు
షాబాజ్ అహ్మద్: రూ. 2 కోట్ల 40 లక్షలు
రూథర్‌ఫొర్డ్: రూ. 1 కోటి
మహిపాల్ లామ్రోర్: రూ. 95 లక్షలు
ఫిన్ అలెన్: రూ. 80 లక్షలు
బెహ్రెండార్ఫ్: రూ.75 లక్షలు
కరణ్ శర్మ: రూ. 50 లక్షలు
సుయశ్ ప్రభుదేశాయ్: రూ.30 లక్షలు
సీవీ మిలింద్: రూ. 25 లక్షలు
ఆకాశ్‌దీప్: రూ. 20 లక్షలు
అనీశ్వర్ గౌతమ్ : రూ. 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment