ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరున్న విదేశీ క్రికెటర్లలో లసిత్ మలింగ ఒకడు. ముంబై ఇండియన్స్ తరపున 12 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మలింగ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిస్తే.. అందులో నాలుగుసార్లు మలింగ భాగస్వామిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను బౌలింగ్‌లో లీడ్ చేసిన మలింగ ఓవరాల్‌గా 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో దాదాపు పుష్కరకాలం పాటు ఒకే జట్టుకు ఆడిన తొలి ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించాడు. కాగా 2020లో వ్యక్తిగత కారణాలతో పక్కకు తప్పుకున్న మలింగ ఆ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు.
చదవండి: IPL 2022: అత్యధిక ధరకు అమ్ముడుపోయేది అతడే...
ఈ విషయం పక్కనబెడితే.. శ్రీలంకకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు మతీషా పతీరాణా.. జూనియర్ లసిత్ మలింగలాగా కనిపిస్తున్నాడు. మలింగ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చు గుద్దినట్లుగా దింపిన పతీరాణా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో తన దేశ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి ఐదు వికెట్లు తీశాడు. కాగా మతీషా పతీరాణా ఐపీఎల్ 2022 మెగావేలంలో తన పేరును కనీస ధర రూ.20 లక్షలతో రిజిస్టర్ చేసుకున్నాడు. మంగళవారం బీసీసీఐ రిలీజ్ చేసిన ఫైనల్ లిస్టులో 23 మంది శ్రీలంక క్రికెటర్ల పేర్లు ఉండగా.. అందులో పతీరాణా కూడా చోటు దక్కించుకున్నాడు.
కాగా పతీరాణా ఇంతకముందే ఐపీఎల్ సీజన్‌లో పాల్గొన్నాడు. అయితే ఆటగాడిగా కాకుండా రిజర్వ్ ప్లేయర్‌గా అందుబాటులో ఉన్నాడు. గతేడాది ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే టీమ్ రిజర్వ్ కోటాలో మతీషా పతీరాణాను పిలిపించుకుంది. మహీష్ తీక్షణతో పాటు పతీరాణా కూడా సీఎస్‌కేకు రిజర్వ్ ప్లేయర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పతీరాణా సీఎస్‌కే ఆటగాళ్లకు తన వైవిధ్యమైన బంతులు విసిరి తొలిసారి దృష్టిలో పడ్డాడు. ధోని కూడా పతీరాణా బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. దీంతో ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో నాలుగుసార్లు చాంపియన్ సీఎస్‌కే పతీరాణాను కనీస ధరకు(రూ.20 లక్షలు) కొనుగోలు చేస్తుందేమో చూడాలి.. లేదంటే ముంబై ఇండియన్స్ అతన్ని దక్కించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment