Photo: IPL Twitter
ఐపీఎల్‌లో ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో వృద్దిమాన్ సాహా ఒకడు. వికెట్ కీపర్ అనే ట్యాగ్‌లైన్ ఉండడంతో సాహా ఇన్నేళ్లయినా ఐపీఎల్‌లో కొనసాగుతూ వస్తున్నాడు. ఈ 16 ఏళ్లలో ఎన్నో జట్లకు ఆడిన సాహా మంచి అనుభవాన్నే గడించాడు.
గతేడాది సాహా గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లడం.. అరంగేట్రం ఏడాదిలోనే ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంతో సాహా జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు. దీనికి తోడు గుజరాత్‌కు నిఖార్సైన వికెట్ కీపర్ అవసరం ఉండడంతో సాహాను పక్కనబెట్టడానికి పాండ్యా ఇష్టపడలేదు. అంతేకాదు గుజరాత్ టైటాన్స్ తరపున బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వస్తున్నాడు.
తాజాగా ఐపీఎల్ 16వ సీజన్‌లో సాహా అంతగా రాణించింది లేదు. ఒకటో రెండో మ్యాచ్‌ల్లో తన ప్రభావం చూపించిన సాహా తొందరగానే ఔటయ్యేవాడు. వచ్చీ రావడంతో బౌండరీలు, సిక్సర్లు కొట్టాలనే ప్రయత్నంలో వికెట్ పారేసుకునేవాడు. కేఎస్ భరత్ లాంటి నాణ్యమైన వికెట్‌కీపర్ ఉన్నా పాండ్యా మాత్రం సాహాకే అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే సాహాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇక ఆడడం లేదు.. జట్టులో చోటు కోల్పోవడం ఖాయం అనుకున్న దశలో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు.
తాజాగా ఆదివారం(మే 7న) లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో అదే జరిగింది. ఈ సీజన్‌లో సాహా తొలిసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. 43 బంతుల్లో 81 పరుగులు చేసిన సాహా ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో సాహా బ్యాటింగ్ చూస్తుంటే సెంచరీ కూడా చేస్తాడేమో అన్నంతలా సాగింది. ఇప్పుడే కాదు ప్రతీ సీజన్‌లోనూ సాహాకు ఇది అలవాటే. 14 మ్యాచ్‌లు ఆడితే అందులో ఒక్కటి మాత్రమే గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌లు ఒకటో, రెండో ఉంటాయి.
Salaam Saha-ab! 🙌
— JioCinema (@JioCinema) May 7, 2023
Wriddhiman scores the fastest 5️⃣0️⃣ for @gujarat_titans in just 20 balls#IPLonJioCinema #TATAIPL #IPL2023 #GTvLSG pic.twitter.com/bUCvkQPzsT
Comments
Please login to add a commentAdd a comment