IPL 2023 GT Vs MI: How Wriddhiman Saha Even Allowed To Take DRS After 15 Seconds Time - Sakshi
Sakshi News home page

Wriddhiman Saha: సమయం ముగిశాకా రివ్యూనా.. అదెలా సాధ్యం? ఏం లాభం!

Published Tue, Apr 25 2023 8:11 PM | Last Updated on Tue, Apr 25 2023 10:37 PM

How-Wriddhiman Saha Even Allowed Take-DRS-15 Seconds-Time-Over GT Vs MI - Sakshi

Photo: IPL Twitter

క్రికెట్‌లో రూల్‌ ప్రకారం ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై డీఆర్‌ఎస్‌ కోరేందుకు ఏ జట్టుకైనా 15 సెకన్లు సమయం ఉంటుంది.  నిర్ణీత సమయంలోగా డీఆర్‌ఎస్‌ తీసుకుంటేనే థర్డ్‌ అంపైర్‌కు వెళ్లుంది. సమయం దాటిపోతే ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ డీఆర్‌ఎస్‌కు కాల్‌అప్‌ ఇస్తారు. 

తాజాగా ఐపీఎల్‌లో మాత్రం ఈ నిబంధనను గాలికొదిలేశారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో  అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ తొలి బంతిని సాహా పుల్‌షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ చేతిలో పడింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు.

అయితే సాహా వెంటనే రివ్యూకు వెళ్లకుండా గిల్‌తో చర్చించాడు. అప్పటికే 15 సెకన్ల గడువు ముగిసింది. కానీ ఈ విషయం ఫీల్డ్‌ అంపైర్‌ గమనించలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత గుజరాత్‌ బ్యాటర్‌ వృద్దిమాన్‌ సాహా రివ్యూకు వెళ్లాడు.  అయితే రివ్యూలో ఫలితం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు స్పైక్‌ కనిపించింది. దీంతో సాహా ఔట్‌ అయినట్లు అంపైర్‌ ప్రకటించాడు. 

అయితే రివ్యూ సమయం ముగిశాకా సాహా డీఆర్‌ఎస్‌ కోరడం సరైనదేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement