
టీమ్‌ఇండియా పేసర్, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత మైదానంలో మెరిశాడు. సర్జరీ తర్వాత తొలిసారి స్టేడియంలో అభిమానుల మధ్య సందడి చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు ప్రత్యక్ష‍్యంగా హాజరయ్యాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ అనంతరం బుమ్రా తమ జట్టుకు చీర్స్ చెబుతున్న ఫొటోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. బూమ్.. బూమ్.. బుమ్రా.. అంటూ రాసుకొచ్చింది.
దీంతో చాలా రోజుల తర్వాత బుమ్రాను చూసి ముంబై అభిమానులు మురిసిపోతున్నారు. త్వరగా జట్టులోకి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. అయితే ఇటీవలే సర్జరీ చేయించుకున్న బుమ్రా ఐపీఎల్‌లో ఆడటం అసాధ్యం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు కూడా అతడ్ని ఎంపిక చేయలేదు. ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతినిస్తోంది.
𝗕𝗢𝗢𝗠 𝗕𝗢𝗢𝗠… 𝘽𝙐𝙈𝙍𝘼𝙃 🤩💙#OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @Jaspritbumrah93 pic.twitter.com/dxcJ20jSia
— Mumbai Indians (@mipaltan) April 25, 2023
కాగా.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీతో మెరిశాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: సమయం ముగిశాకా రివ్యూనా.. అదెలా సాధ్యం? ఏం లాభం!