
Photo: IPL Twitter
ముంబై ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో తొలి సిక్సర్ బాదాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తొమ్మిదో నెంబర్ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. మోహిత్ షార్ట్ బాల్ వేయగా.. అర్జున్ డీప్‌స్వ్కేర్ దిశగా సిక్సర్ కొట్టడం హైలెట్‌గా నిలిచింది.
కాగా అర్జున్‌కు ఇదే తొలి సిక్సర్ కాగా.. తొలి ఐపీఎల్ సీజన్ కూడా. బౌలర్‌గా మంచి ప్రదర్శన కనబరిచిన అర్జున్.. ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ సిక్సర్‌తో అలరించడంతో సచిన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అర్జున్ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వాలని.. అతనికి మంచి టాలెంట్ ఉందని.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపిస్తే ముంబైకి మంచి ప్రయోజనం ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. నెహల్ వదేరా 21 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కామెరాన్ గ్రీన్ 33 పరుగులు, సూర్యకుమార్ 23 పరుగులు చేశాడు.
గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు గుజరాత్ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గిల్ 56, మిల్లర్ 46, అభినవ్ మనోహర్ 46 పరుగులతో రాణించారు.
Arjun aims BIG 🎯#GTvMI #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/cF4DZVviUm
— JioCinema (@JioCinema) April 25, 2023
చదవండి: ముంబై , గుజరాత్ మ్యాచ్.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్!