Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరిగిన వాంఖడే స్టేడియం పరుగులు వర్షంతో తడిసి ముద్దయింది. తొలుత సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. అటుపై గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 219 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఒక దశలో 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక గుజరాత్‌కు భారీ ఓటమి తప్పదనుకున్న వేళ రషీద్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
ఎనిమిదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకొని ఓవరాల్‌గా 32 బంతుల్లో 79 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ క్రమంలోనే రషీద్ ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు.
► ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో బౌలింగ్‌లో నాలుగు వికెట్లు.. బ్యాటింగ్‌లో ఫిఫ్టీతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడం ఇది నాలుగో సారి మాత్రమే. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రషీద్ 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 79 పరుగులు చేశాడు. ఇంతకముందు యువరాజ్ సింగ్(ఆర్‌సీబీ, 83 పరుగులు, 4/35), యువరాజ్ సింగ్(పుణే వారియర్స్, 66 పరుగులు, 4/29), మిచెల్ మార్ష్(ఢిల్లీ క్యాపిటల్స్, 63 పరుగులు, 4/27) ఉన్నారు.
► టి20 క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించడం ఇది నాలుగోసారి. ముంబైతో మ్యాచ్లో రషీద్-అల్జారీ జోసెఫ్ జంట 88* పరుగులు జోడించి రెండో స్థానంలో ఉన్నారు. తొలి స్థానంలో బెల్జియంకు చెందిన సబర్ జకీల్, సక్లెయిన్ అలీ 2021లో ఆస్ట్రియాపై 132* పరుగులు ఉన్నారు.
► ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రషీద్ ఖాన్ చోటు సంపాదించాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రషీద్ 10 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో సనత్ జయసూర్య 11 సిక్సర్లతో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్‌లు పదేసి సిక్సర్లతో ఉన్నారు.
► ఐపీఎల్‌లో ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ చోటు సంపాదించాడు. రషీద్ కంటే ముందు పాట్ కమిన్స్(2021లో 66 పరుగులు నాటౌట్), హర్బజన్ సింగ్(2015లొ 64 పరుగులు), క్రిస్ మోరిస్(2017లో 52 పరుగులు నాటౌట్) ఉన్నారు.
“Main expert hoon, mujhe sab aata hai” 💥
— JioCinema (@JioCinema) May 12, 2023
Maiden IPL 5️⃣0️⃣ for @rashidkhan_19 👏🏼#MIvGT #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/Yto3zZ52bC
Comments
Please login to add a commentAdd a comment