
Wriddiman Saha Half Century Mark After 2017 Since 11 Tests.. టీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ఎట్టకేలకు రాణించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్థ సెంచరీతో రాణించాడు. 126 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్ సహాయంతో 61 పరుగులతో నౌటౌట్‌గా నిలిచిన సాహా.. టీమిండియాకు మంచి ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. అయ్యర్ తర్వాత మంచి ఇన్నింగ్స్‌తో మెరిసిన సాహాకు టెస్టుల్లో ఇది ఆరో అర్థసెంచరీ.
కాగా సాహా టెస్టుల్లో అర్థ సెంచరీ చేసి నాలుగేళ్లవుతుంది. 2017లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాహా ఆఖరిసారిగా అర్థ సంచరీ చేశాడు. అప్పటినుంచి తాను ఆడిన 11 టెస్టుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సాహాపై ప్రశంసల వర్షం కురిపించారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. 2 పరుగులు చేసిన ఓపెనర్ యంగ్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆట ఐదోరోజులో న్యూజిలాండ్ గెలవాలంటే 280 పరుగులు అవసరం కాగా.. టీమిండియా 9 వికెట్లు కావాలి.