Ravindra Jadeja Famous Sword Celebration After 50 Runs-Became Viral - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు

Published Fri, Feb 10 2023 6:47 PM | Last Updated on Fri, Feb 10 2023 7:39 PM

Ravindra Jadeja Famous Sword Celebration After 50 Runs-Became Viral - Sakshi

నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలుత బంతితో ఐదు వికెట్లు తీసిన జడ్డూ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అర్థసెంచరీతో రాణించాడు. 66 పరుగులతో నాటౌట్‌గా ఉన్న జడ్డూ మూడోరోజు ఆటలో సెంచరీ చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. జడ్డూ ఎప్పుడు సెంచరీ లేదా అర్థసెంచరీ బాదినా బ్యాట్‌ను కత్తిలా తిప్పడం(Sword Celebration) బాగా ఫేమస్‌ అయ్యింది. నిజంగా జడ్డూ తిప్పినంత అందంగా ఎవరు తిప్పలేరు అన్నట్లుగా అతని కత్తిసాము ఉంటుంది. దీనికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. 

అయితే గాయంతో జడేజా దాదాపు ఆరు నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ సమయంలో అతని కత్తిసాము సెలబ్రేషన్‌ను అభిమానులు చాలా మిస్సయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఆ దర్శనం కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక రోహిత్‌ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికి మధ్యలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. 240 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన దశలో జడేజాకు  అక్షర్‌ తోడయ్యాడు. ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు అజేయంగా జోడించారు. ప్రస్తుతం టీమిండియా రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జడేజా 66, అక్షర్‌ పటేల్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: ఆసీస్‌ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్‌ తొక్కేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement