కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన చందర్‌పాల్‌ కుమారుడు | Tej Narayan Hits Half Century Zimbabwe Vs West Indies 1st Test | Sakshi
Sakshi News home page

Tagenarine Chanderpaul: కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన చందర్‌పాల్‌ కుమారుడు

Published Sun, Feb 5 2023 7:46 AM | Last Updated on Sun, Feb 5 2023 7:49 AM

Tej Narayan Hits Half Century Zimbabwe Vs West Indies 1st Test - Sakshi

జింబాబ్వే, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి టెస్టు తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ కొట్టింది. బులవాయోలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 112 పరుగులు సాధించింది. విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ కుమారుడు తేజ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ (170 బంతుల్లో 55 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (138 బంతుల్లో 55 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) కూడా క్రీజులో ఉన్నాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement