క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ తమ విజయానికి ఇంకా 202 పరుగుల దూరంలో నిలవగా.. కివీస్ విజయానికి ఇంకా 6 వికెట్లు మాత్రమే కావాలి. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.
క్రీజులో ప్రస్తుతం ట్రావిస్ హెడ్(17),మార్ష్(27) పరుగులతో ఉన్నారు. మాట్ హెన్రీ, సీర్స్ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్(9) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. ఇక 134/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 372 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(82), టామ్ లాథమ్(73) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు, లయోన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది.
చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే'
Comments
Please login to add a commentAdd a comment