Marais Erasmus
-
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు. నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది. అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా. అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను. ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండరీ అంపైర్..
దక్షిణాఫ్రికా లెజండరీ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు అనంతరం 16 ఏళ్ల అంపైరింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 2006లో జోహన్స్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో ఎరాస్మస్ అంపైర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కెరీర్లో 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20ల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా ఎరాస్మస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా ఎరాస్మస్ వ్యవహరించాడు.అదేవిధంగా మూడు సార్లు(2016, 2017, 2021) ఐసీసీ బెస్ట్ అంపైర్‌గా ఎరాస్మస్ నిలిచాడు. కాగా ఇప్పుడు ఎరాస్మస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్లో దక్షిణాఫ్రికా నుంచి అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఒక్కరే మిగలనున్నారు. -
బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు?
క్రికెట్లో ఆటగాళ్లతో పాటు అంపైర్ల పాత్ర కూడా చాలా కీలకం. బౌలర్ ఎన్ని బంతులు వేస్తున్నాడు.. బ్యాటర్లు ఎన్ని పరుగులు తీశారు.. వైడ్ బాల్స్, నో బాల్స్, సిక్సర్లు, బౌండరీలు, క్యాచ్‌లు, ఎల్బీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫీల్డ్ ఉన్న ఇద్దరు అంపైర్లు చాలా బిజీగా ఉంటారు. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగితే రాజీ కుదర్చడం కూడా అంపైర్ల బాధ్యత. బాధ్యతతో కూడిన అంపైరింగ్‌లో నిర్లక్ష్యం వహించడం ఎప్పుడైనా చూశారా. చూడకపోతే మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ను రీక్యాప్ చేయండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లెగ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ బౌలర్ వేసిన బంతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడం కనిపించింది. ఇందులో మరొక విషమేంటంటే.. ఆ సమయంలో ఎరాస్మస్ వెనక్కి తిరిగి చేతితో ఏదో లెక్కబెడుతున్నట్లు కనిపించింది. అప్పటికే అన్రిచ్ నోర్ట్జే బంతి వేయడం.. క్రీజులో ఉన్న జేసన్ రాయ్ షాట్ ఆడడం జరిగిపోయాయి. ఇంగ్లండ్ బ్యాటర్లు పరిగెత్తే సమయంలో అంపైర్ ఎరాస్మస్ అప్పుడే మేల్కొన్నట్లు ముందుకు తిరగడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా 24వ ఓవర్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వన్డే క్రికెట్‌పై బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. అంపైర్ పని కాకుండా అంత బిజీగా ఏం చేస్తున్నాడబ్బా.. పట్టించుకోవడం లేదు కాబట్టే ప్రతీది థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తున్నారనుకుంటా.. గుత్కా సుప్రీమసీ అంటూ కామెంట్స్ చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ జేసన్ రాయ్(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్ మలన్(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్ షంసీ ఒక వికెట్ తీశాడు. pic.twitter.com/KKPnERRMuw — 🗂️ (@TopEdgeCricket2) January 27, 2023 చదవండి: 'ప్రయోగాలకు స్వస్తి పలకండి'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం -
మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా ఉంది.. టీమిండియా ఆటగాళ్లపై అంపైర్ అసహనం
జొహనెస్‌బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో టీమిండియా 266 పరుగులకు ఆలౌటై ఆతిధ్య జట్టుకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు ఆటకు అంతరాయం ఏర్పడడంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. వరుణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడితే తప్ప మ్యాచ్ ఫలితాన్ని ఎవరూ ఆపలేరు. Marais Erasmus 🤣 pic.twitter.com/xAC0yT8Uef — Benaam Baadshah (@BenaamBaadshah4) January 5, 2022 ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో టీమిండియా బౌలింగ్ చేస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్లో మార్క్రమ్కు బౌలింగ్ చేస్తున్న శార్ధూల్.. పదే పదే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ మరియాస్ ఎరాస్మస్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి.. ‘మీ అప్పీలకు గుండెపోటు వచ్చేలా ఉంది..’ అంటూ గొణిగాడు. ఈ వ్యాఖ్యలు వికెట్లకు అమర్చిన మైక్‌లో రికార్డు కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, అంతకుముందు బుమ్రా, జన్సెన్ల మధ్య వాగ్వాదం సందర్భంగా కూడా ఎరాస్మస్ ఇద్దరికి సర్ధి చెప్పడం మనం చూసాం. చదవండి: జబర్దస్త్ కెప్టెన్ ఎల్గర్.. కేవలం తన గురించే: పంత్ కామెంట్స్ వైరల్