జొహనెస్‌బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో టీమిండియా 266 పరుగులకు ఆలౌటై ఆతిధ్య జట్టుకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు ఆటకు అంతరాయం ఏర్పడడంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. వరుణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడితే తప్ప మ్యాచ్ ఫలితాన్ని ఎవరూ ఆపలేరు.
Marais Erasmus 🤣 pic.twitter.com/xAC0yT8Uef
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 5, 2022
ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో టీమిండియా బౌలింగ్ చేస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో మార్క్రమ్‌కు బౌలింగ్ చేస్తున్న శార్ధూల్.. పదే పదే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ మరియాస్ ఎరాస్మస్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి.. ‘మీ అప్పీలకు గుండెపోటు వచ్చేలా ఉంది..’ అంటూ గొణిగాడు. ఈ వ్యాఖ్యలు వికెట్లకు అమర్చిన మైక్‌లో రికార్డు కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, అంతకుముందు బుమ్రా, జన్సెన్‌ల మధ్య వాగ్వాదం సందర్భంగా కూడా ఎరాస్మస్ ఇద్దరికి సర్ధి చెప్పడం మనం చూసాం.
చదవండి: జబర్దస్త్ కెప్టెన్ ఎల్గర్.. కేవలం తన గురించే: పంత్ కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment