
చట్టోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫీల్డర్లు నవ్వులు పూయించారు. ఓ క్యాచ్‌ను ఏకంగా ముగ్గురు పట్టుకునేందుకు ప్రయత్నించి చివరికి విజయవంతంగా నేలపాలు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్ 121వ ఓవర్ చివరి బంతికి లంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య కవర్స్ దిశగా డ్రైవ్ చేసే ప్రయత్నం చేయగా బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఇక్కడే డ్రామా మొదలైంది.
Dropped x 3🫥pic.twitter.com/PucY2gbLRV
— CricTracker (@Cricketracker) March 31, 2024
తొలుత తొలి స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయిన బంతి.. ఆతర్వాత సెకెండ్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లో నుంచి, ఆ తర్వాత మూడో స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయి విజయవంతంగా నేలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట నువ్వులు పూయిస్తుంది. కాగా, ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో క్లియర్‌గా బ్యాట్‌కు తాకిన బంతికి ఎల్బీ కోసం రివ్యూకి వెళ్లి నవ్వుల పాలయ్యాడు.
What just happened? 👀
— FanCode (@FanCode) March 30, 2024
.
.#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov
ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు అర్దసెంచరీలు సాధించారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.