చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 159 ఓవర్లలో 531 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 314/4తో రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 217 పరుగులు సాధించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు దినేశ్ చండీమల్ (59; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధనంజయ డిసిల్వా (70; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామిందు మెండిస్ (92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.
ఓవరాల్‌గా లంక ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు చేశారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ నమోదు కాకుండా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా శ్రీలంక రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు (1976లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌పై 524/9 డిక్లేర్డ్) పేరిట ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment