ఢాకా: శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బౌలర్ల హవా కొనసాగుతోంది. తొలి రోజే 14 వికెట్లు నేలకూలిన ఈ మ్యాచ్‌లో రెండో రోజూ మరో 14 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 110 పరుగులకే కట్టడి చేసిన లంక... రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది.
ప్రస్తుతం 2 వికెట్లు చేతిలో ఉన్న లంక ఓవరాల్‌గా 312 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 56/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 110 పరుగులకే ఆలౌటైంది.
శ్రీలంకదే పైచేయి
Published Sat, Feb 10 2018 12:30 AM | Last Updated on Sat, Feb 10 2018 12:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment