చరిత్ర తిరగరాసిన భారత్‌-సౌతాఫ్రికా రెండో టెస్ట్‌ మ్యాచ్‌ | IND VS SA 2nd Test: Shortest Completed Test Match As Per Balls Bowled | Sakshi
Sakshi News home page

చరిత్ర తిరగరాసిన భారత్‌-సౌతాఫ్రికా రెండో టెస్ట్‌ మ్యాచ్‌

Published Thu, Jan 4 2024 5:42 PM | Last Updated on Thu, Jan 4 2024 6:02 PM

IND VS SA 2nd Test: Shortest Completed Test Match As Per Balls Bowled - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ పలు రికార్డులను కొల్లగొట్టింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే (నాలుగున్నర సెషన్లు) ముగిసిన ఈ మ్యాచ్‌.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ కేవలం 642 బంతుల్లోనే ముగియగా.. గత రికార్డు 656 బంతులుగా ఉండింది. 

1932లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌ ఈ మ్యాచ్‌కు ముందు వరకు టెస్ట్‌ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్య 1935లో జరిగిన మ్యాచ్‌ మూడో స్థానంలో (672 బంతుల్లో) ఉండగా.. ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్‌ నాలుగో స్థానంలో (788), ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్‌ (లార్డ్స్‌) ఐదో స్థానంలో (792) ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, కేప్‌టౌన్‌ టెస్ట్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం​ సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్‌ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా  (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్‌ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement