ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో భారత అంపైర్ నితిన్ మీనన్ మరోసారి స్థానం దక్కించుకున్నాడు. మీనన్ సేవలను మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఐసీసీ గురువారం ప్రకటించింది. ఈ నెలాఖరులో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా మీనన్ న్యూట్రల్ అంపైర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. ఐసీసీ ప్రకటించిన 11 మంది సభ్యుల ఎలైట్ ప్యానెల్‌లో ఇండోర్‌కు చెందిన 38 ఏళ్ల నితిన్ మీనన్ ఏకైక భారత అంపైర్ కావడం విశేషం.
2020లో కోవిడ్ సమయంలో మీనన్ తొలిసారి ఎలైట్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఎస్. వెంకటరాఘవన్, ఎస్. రవి తర్వాత ఎలైట్ క్లబ్‌లో చేరిన మూడో భారతీయుడిగా నితిన్ మీనన్ రికార్డుల్లో నిలిచాడు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా మీనన్ కేవలం భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే అంపైర్‌గా వ్యవహరించాడు. తాజాగా విదేశాల్లో ప్రయాణ అంక్షలు ఎత్తివేయడంతో మీనన్ తొలిసారి న్యూట్రల్ అంపైర్‌గా కనిపించనున్నాడు.
మీనన్ ప్రస్తుతంభారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో మీనన్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అలీమ్ దార్, న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, ఆస్ట్రేలియా నుండి పాల్ రీఫిల్, ఇంగ్లండ్ నుంచి రాడ్ టక్కర్, వెస్టిండీస్ నుండి జోయెల్ విల్సన్ ఉన్నారు.
చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్‌తో సంబంధం అంటగట్టి'
Comments
Please login to add a commentAdd a comment