IND vs SA T20I: Umesh Yadav, Shreyas Iyer,Shahbaz Ahmed Added In India Squad Against South Africa - Sakshi
Sakshi News home page

Ind Vs SA T20 Series: షమీ అవుట్‌: జట్టులోకి ఉమేశ్‌ యాదవ్‌.. అయ్యర్‌, అహ్మద్‌ కూడా: బీసీసీఐ

Published Wed, Sep 28 2022 1:42 PM | Last Updated on Wed, Sep 28 2022 3:12 PM

Ind Vs SA T20s: Umesh Yadav Shreyas Iyer Shahbaz Ahmed Added India Squad - Sakshi

ఉమేశ్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, షాబాజ్‌ అహ్మద్‌(PC: BCCI)

South Africa tour of India, 2022 T20 Series - India Updated Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఉమేశ్‌ యాదవ్‌ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. పేసర్‌ మహ్మద్‌ షమీ కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోని నేపథ్యంలో అతడి స్థానాన్ని ఉమేశ్‌తో భర్తీ చేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి పేర్కొంది.

హుడా కూడా అవుట్‌
అదే విధంగా వెన్నునొప్పితో దూరమైన దీపక్‌ హుడా స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి రానున్నట్లు తెలిపింది. ఇక స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో యువ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ టీ20 జట్టులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.

ఇక హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకోనున్నట్లు తెలిపింది. కాగా తిరువనంతపురం వేదికగా బుధవారం టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మొదటి టీ20తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు(అప్‌డేట్‌):
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, షాబాజ్‌ అహ్మద్‌.

చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్‌
Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్‌ నాశనమైంది'.. ఇర్ఫాన్‌ పఠాన్‌ అదిరిపోయే రిప్లై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement