న్యూఢిల్లీ: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరిన భారత స్టార్ లక్ష్య సేన్ ర్యాంక్ మెరుగైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఐదు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రణయ్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఏప్రిల్ 30వ తేదీలోపు టాప్–16లో ఉంటే ప్రణయ్, లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 11వ ర్యాంక్‌లో మార్పు లేదు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్ జోడీగా అవతరించింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం నాలుగు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment