సెమీస్‌లో బోపన్న జంట
దుబాయ్: భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలాండ్) ద్వయం 6–3, 6–4తో మెర్జియా (రొమేనియా)–ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై విజ యం సాధించింది.
అంతకుముందు తొలి రౌండ్లో బోపన్న–మట్కోవ్‌స్కీ 5–7, 6–3, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–గ్రానోలెర్స్ (స్పెయిన్)లపై గెలిచారు.