న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో మాజీ చాంపియన్ రాంచీ రేస్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాంచీ రేస్ 6–2 గోల్స్ తేడాతో గెలిచింది. రాంచీ రేస్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ చేయగా, ఇమ్రాన్ ఖాన్ ఒక ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించాడు. ఢిల్లీ జట్టుకు జస్టిన్ రీడ్ ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు.
నిర్ణీత 10 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాంచీ జట్టు 23 పాయింట్లతో ఢిల్లీ వేవ్‌రైడర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఉత్తరప్రదేశ్ విజార్డ్స్, ఢిల్లీ వైవ్‌రైడర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. ఇప్పటికే దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరాయి.
రాంచీ రేస్ నిష్క్రమణ
Published Wed, Feb 22 2017 1:16 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
Advertisement
Advertisement