Ranchi Race Team
-
రాంచీ రేస్ నిష్క్రమణ
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో మాజీ చాంపియన్ రాంచీ రేస్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాంచీ రేస్ 6–2 గోల్స్ తేడాతో గెలిచింది. రాంచీ రేస్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ చేయగా, ఇమ్రాన్ ఖాన్ ఒక ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించాడు. ఢిల్లీ జట్టుకు జస్టిన్ రీడ్ ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు. నిర్ణీత 10 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాంచీ జట్టు 23 పాయింట్లతో ఢిల్లీ వేవ్‌రైడర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఉత్తరప్రదేశ్ విజార్డ్స్, ఢిల్లీ వైవ్రైడర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. ఇప్పటికే దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరాయి. -
రాంచీ రేస్‌కు ముంబై షాక్
ముంబై: చివరి రెండు అర్ధభాగాలను పది మంది ఆటగాళ్లతోనే ఆడినప్పటికీ... పట్టుదలగా పోరాడిన ముంబై దబంగ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టుకు షాక్ ఇచ్చింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 7-5 గోల్స్ తేడాతో రాంచీ రేస్ జట్టును ఓడించింది. రెండో క్వార్టర్ చివరి సెకన్లలో ముంబై ఫార్వర్డ్ యూసుఫ్ అఫాన్కు రెడ్ కార్డు ప్రకటించడంతో ఆ జట్టు మిగిలిన మ్యాచ్‌ను పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ముంబై తరఫున స్వాన్, నీలకంఠ శర్మ, ఫ్లోరియన్ ఒక్కో ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) చేయగా... దివాకర్ రామ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మరోవైపు రాంచీ జట్టులో పెనాల్టీ కార్నర్ల ద్వారా యాష్లే జాక్సన్ రెండు గోల్స్, సందీప్ ఒక గోల్ చేశాడు. సర్వంజిత్ సింగ్ ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించాడు.