ముంబై: చివరి రెండు అర్ధభాగాలను పది మంది ఆటగాళ్లతోనే ఆడినప్పటికీ... పట్టుదలగా పోరాడిన ముంబై దబంగ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టుకు షాక్ ఇచ్చింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 7-5 గోల్స్ తేడాతో రాంచీ రేస్ జట్టును ఓడించింది. రెండో క్వార్టర్ చివరి సెకన్లలో ముంబై ఫార్వర్డ్ యూసుఫ్ అఫాన్‌కు రెడ్ కార్డు ప్రకటించడంతో ఆ జట్టు మిగిలిన మ్యాచ్‌ను పది మంది ఆటగాళ్లతోనే ఆడింది.
ముంబై తరఫున స్వాన్, నీలకంఠ శర్మ, ఫ్లోరియన్ ఒక్కో ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) చేయగా... దివాకర్ రామ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మరోవైపు రాంచీ జట్టులో పెనాల్టీ కార్నర్‌ల ద్వారా యాష్లే జాక్సన్ రెండు గోల్స్, సందీప్ ఒక గోల్ చేశాడు. సర్వంజిత్ సింగ్ ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించాడు.
రాంచీ రేస్‌కు ముంబై షాక్
Published Thu, Feb 4 2016 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement