చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం కళింగ లాన్సర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌ను వారియర్స్ 4-4తో ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో ఇదే తొలి డ్రా కాగా రాంచీ రేస్ తర్వాత సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. తొలి అర్ధభాగంలో పూర్తి దూకుడును ప్రదర్శించిన కళింగ జట్టుకు 14వ నిమిషంలో మలక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో 2-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత 29వ నిమిషంలో క్విర్జిన్ కాస్పర్స్ ఫీల్డ్ గోల్‌తో 4-0తో పైచేయి సాధించింది.
అయితే ద్వితీయార్ధంలో వ్యూహం మార్చి ఆడిన పంజాబ్‌కు ఫలితం లభించింది. 35వ నిమిషంలో గోడెస్ ఫీల్డ్ గోల్ చేయడంతో పంజాబ్ 2-4తో మ్యాచ్‌లో నిలిచింది. మూడో క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నా మరో గోల్ నమోదు కాలేదు. అయితే ఆట మరో నిమిషం (59)లో ముగుస్తుందనగా వెట్టన్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో పంజాబ్‌ను ఓటమి నుంచి తప్పించి మ్యాచ్‌ను ‘డ్రా’గా మలిచాడు.
సెమీస్‌లో వారియర్స్
Published Tue, Feb 16 2016 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM
Advertisement
Advertisement