Punjab Warriors team
-
పంజాబ్ వారియర్స్‌ను గెలిపించిన వీర్డెన్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను వీర్డెన్ గోల్‌గా మలిచి పంజాబ్‌ను గెలిపించాడు. -
సెమీస్‌లో వారియర్స్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం కళింగ లాన్సర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌ను వారియర్స్ 4-4తో ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో ఇదే తొలి డ్రా కాగా రాంచీ రేస్ తర్వాత సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. తొలి అర్ధభాగంలో పూర్తి దూకుడును ప్రదర్శించిన కళింగ జట్టుకు 14వ నిమిషంలో మలక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో 2-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత 29వ నిమిషంలో క్విర్జిన్ కాస్పర్స్ ఫీల్డ్ గోల్‌తో 4-0తో పైచేయి సాధించింది. అయితే ద్వితీయార్ధంలో వ్యూహం మార్చి ఆడిన పంజాబ్‌కు ఫలితం లభించింది. 35వ నిమిషంలో గోడెస్ ఫీల్డ్ గోల్ చేయడంతో పంజాబ్ 2-4తో మ్యాచ్‌లో నిలిచింది. మూడో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నా మరో గోల్ నమోదు కాలేదు. అయితే ఆట మరో నిమిషం (59)లో ముగుస్తుందనగా వెట్టన్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో పంజాబ్‌ను ఓటమి నుంచి తప్పించి మ్యాచ్‌ను ‘డ్రా’గా మలిచాడు. -
వారియర్స్‌కు రెండో గెలుపు
భువనేశ్వర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన పంజాబ్ వారియర్స్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7-3 గోల్స్ తేడాతో కళింగ లాన్సర్స్‌ను ఓడించింది. వారియర్స్ తరఫున స్టార్ డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్, అఫాన్ యూసుఫ్ రెండేసి గోల్స్ చేయగా... ధరమ్వీర్ సింగ్, లూకాస్ మార్టిన్ రే, సిమోన్ ఆర్చర్డ్, కెప్టెన్ జేమీ డ్వెయర్ ఒక్కో గోల్ సాధించారు. కళింగ జట్టులో గొంజాలో పెలియట్ రెండు గోల్స్, మన్దీప్ అంటిల్ ఒక గోల్ చేశారు. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, మరో మ్యాచ్‌లో ఓడిన వారియర్స్ 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.