
బెర్లిన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీ జట్టుతో ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. 35వ నిమిషంలో సామెత్ అకెదిన్ గోల్‌తో టర్కీ ఖాతా తెరిచింది. 70వ నిమిషంలో డెవ్రిజ్ గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది.
76వ నిమిషంలో టర్కీ ప్లేయర్ మెర్ట్ ముల్డర్ ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో నెదర్లాండ్స్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నెదర్లాండ్స్ కాపాడుకొని 2004 తర్వాత మళ్లీ యూరో టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment