లండన్: వింబుల్డన్ క్లబ్ స్క్వాష్ స్క్వేర్డ్ ఓపెన్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషల్ సెమీఫైనల్ నుంచే వెనుదిరిగాడు. టాప్ సీడ్‌గా బరిలో దిగిన సౌరవ్ సెమీస్‌లో 3–11, 10–12, 9–11తో నాలుగో సీడ్ అలెన్ క్లినీ (స్కాట్లాండ్) చేతిలో ఓడిపోయాడు. మహేశ్ మాన్ గోయంకార్, విక్రమ్ మల్హోత్రా క్వార్టర్స్‌లోనే ఓడిపోగా.. సౌరవ్ నిష్క్రమణతో భారత ఆటగాళ్ల కథ ముగిసిపోయింది.