
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. దుబాయ్‌లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) ద్వయం 5–7, 7–6 (7/5), 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ, 18వ స్థానాల్లో ఉన్న లాయిడ్ గ్లాస్‌పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీపై గెలిచింది.
తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించిన యూకీ జోడీ క్వార్టర్ ఫైనల్లోనూ కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–ఆసీస్ జోడీ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment