
వారం రోజుల వ్యవధిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ మరోసారి ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీని బోల్తా కొట్టించాడు. దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా) ద్వయం 4–6, 7–6 (7/1), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–ఆసీస్ జోడీ ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. గతవారం దోహా ఓపెన్–500 టోర్నీలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి ఆడిన యూకీ క్వార్టర్ ఫైనల్లో అరెవాలో–పావిక్ జంటపై గెలిచింది. దుబాయ్ ఓపెన్‌లోనే ఆడుతున్న మరో భారత జోడీ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ తొలి రౌండ్‌లో 4–6, 6–7 (6/8)తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment