టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన భారత జట్టు ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
హాంకాంగ్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన భారత జట్టు ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3–0తో విజయం సాధించింది.
భారత్ తరఫున అభయ్ సింగ్ 11–4, 11–2, 11–3తో మాన్యుల్ చాన్‌పై, ఆర్యమన్ 11–1, 11–1, 11–1తో కా చోన్ వుపై, రంజిత్ సింగ్ 11–1, 11–0, 11–3తో కార్లోస్ చాన్‌ౖపై గెలిచారు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో హాంకాంగ్‌తో భారత్; మలేసియాతో పాకిస్తాన్ తలపడతాయి.