
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. కర్ణాటకలోని విజయనగరలో జరుగుతోన్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్ 5–0తో మాన్సీ శర్మ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది.
81 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో తెలంగాణకే చెందిన సారా ఖురేషి మహారాష్ట్ర బాక్సర్ మోహిని చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment