
Tamil Nadu Enters Final Beat Hyderabad By 8 Wickets.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది.తనయ్ త్యాగరాజన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమ్యారు. తమిళనాడు బౌలర్ శరవణ కుమార్ 5 వికెట్లతో దుమ్మురేపగా.. ఎం అశ్విన్, మహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ విజయ్‌శంకర్ 43 పరుగులు నాటౌట్.. సాయి సుదర్శన్ 34 నాటౌట్ గెలిపించారు. ఈ విజయంతో తమిళనాడు ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ, కర్ణాటక మధ్య జరగనున్న సెమీఫైనల్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది.
చదవండి: chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment