
రాజ్‌కోట్: లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (4/37) మాయాజాలం... అంకిత్ కుమార్ (102; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం... వెరసి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోరీ్నలో 12 ఏళ్ల తర్వాత హరియాణా జట్టు మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
బెంగాల్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బెంగాల్ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. షహబాజ్ అహ్మద్ (100; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో రాణించాడు. అనంతరం హరియాణా 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు సాధించి విజయం సాధించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్తాన్ 200 పరుగుల తేడాతో కేరళపై, కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విదర్భపై, తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నాయి.