సెమీఫైనల్‌కు యు ముంబా | Yu Mumba Valley team qualified for the semifinals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్‌కు యు ముంబా

Published Tue, Feb 19 2019 4:36 AM | Last Updated on Tue, Feb 19 2019 4:36 AM

Yu Mumba Valley team qualified for the semifinals - Sakshi

చెన్నై: ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో యు ముంబా వాలీ జట్టు సెమీఫైనల్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. చెన్నైలో సోమవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో యు ముంబా 10–15, 15–12, 15–13, 15–12, 15–8తో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టుపై గెలిచింది. కాలికట్, కొచ్చి జట్లు గతంలోనే సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖాయం చేసుకోగా... చెన్నై, యు ముంబా, బ్లాక్‌ హాక్స్‌ హైదరాబాద్‌ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.

అయితే మెరుగైన సెట్‌ల స్కోరు ఆధారంగా చెన్నై (+1), యు ముంబా (–1) ముందంజ వేయగా... బ్లాక్‌ హాక్స్‌ హైదరాబాద్‌ (–3) నిష్క్రమించింది. లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టు పాయింట్ల ఖాతానే తెరువలేదు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో కాలికట్‌ హీరోస్‌తో యు ముంబా తలపడుతుంది. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్‌ ఆడుతుంది. గురువారం విశ్రాంతి దినం తర్వాత... శుక్రవారం ఫైనల్‌ పోరు జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement