
కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ
హైదరాబాద్: చైనాలోని షాంఘైలో జరుగుతోన్న ప్రపంచకప్ స్టేజ్–1 ఆర్చరీ పోటీల్లో భారత బృందం రాణించింది. మిక్స్‌డ్ విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ జోడీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ 152–158తో కొరియా చేతిలో పరాజయం పాలైంది.