
సెమీస్‌లో యూకీ
జుహై: భారత టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. అగస్టీన్ వెలోటి (అర్జెంటీనా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ తొలి సెట్‌ను 6–1తో దక్కించుకున్నాడు.
రెండో సెట్‌లో అతను 2–1తో ఆధిక్యంలో ఉన్నదశలో వెలోటి గాయం కారణంగా వైదొలగడంతో యూకీని విజేతగా ప్రకటించారు. శనివారం జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ ఎవగెని డాన్‌స్కాయ్ (రష్యా)తో యూకీ తలపడతాడు.