పాపం కార్నెట్‌.. ఈసారి కూడా కల నెరవేరలేదు | Danielle Collins Beats Alize Cornet Enters Australian Open 2022 Semi-Final | Sakshi
Sakshi News home page

Australian Open 2022: పాపం కార్నెట్‌.. ఈసారి కూడా కల నెరవేరలేదు

Published Wed, Jan 26 2022 12:22 PM | Last Updated on Wed, Jan 26 2022 1:36 PM

Danielle Collins Beats Alize Cornet Enters Australian Open 2022 Semi-Final - Sakshi

డేనియల్‌ కొలిన్స్‌; ఇన్‌సెట్‌లో అలిజె కార్నెట్‌

ఫ్రెంచ్‌ వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అలిజె కార్నెట్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి గ్రాండ్‌స్లామ్‌ గెలవాలన్న ఆమె కల.. కలగానే మిగిలిపోయింది. తన 17 ఏళ్ల కెరీర్‌లో ఒక గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన అలిజె కార్నెట్‌కు.. డేనియల్ కాలిన్స్ చేతిలో భంగపాటు ఎదురైంది. అమెరికాకు చెందిన డేనియల్ కాలిన్స్.. కార్నెట్‌ను 7-5,6-1తో వరుస సెట్లలో ఖంగుతినిపించి సెమీఫైనల్లో అడుగపెట్టింది. 

చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్‌, యాష్లే బార్టీ

ఇగా స్వియాటెక్, కాయ కనేపిల మధ్య జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ను విజయం వరించింది. మ్యాచ్‌లో 4-6,7-6(7/2),6-3 తేడాతో స్వియాటెక్.. కనేపిపై విజయం సాధించిన తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. మొత్తం మూడు గంటల ఒక నిమిషం పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన స్వియాటెక్‌ రెండో సెట్‌లో ఫుంజుకుంది. ఇక ఆఖరిసెట్‌లో 6-3తో గెలిచి సెమీస్‌కు చేరింది. ఇక ఇగా స్వియాటెక్‌, డేనియల్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ జరగనుంది. తొలి సెమీఫైనల్లో యాష్లే బార్టీ, కీస్‌ మాడిసన్‌లు తలపడనున్నారు.

చదవండి: తొందర పడ్డానేమో! రిటైర్మెంట్‌పై సానియా మీర్జా వ్యాఖ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement