Alize Cornet
-
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్
యూఎస్ ఓపెన్‌లో బుధవారం తెల్లవారుజామున పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో బ్రిటన్ స్టార్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఎమ్మా రాడుకానుకు బిగ్‌షాక్ తగిలింది. తొలి రౌండ్లో ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ చేతిలో 6-3, 6-3తో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మరుసటి ఏడాదే తొలి రౌండ్లో వెనుదిరిగిన మూడో క్రీడాకారిణిగా ఎమ్మా రాడుకాను నిలిచింది. ఇంతకముందు 2004లో యూఎస్ ఓపెన్ నెగ్గిన స్వెత్లానా కుజ్నెత్సోవా.. మరుసటి ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఇక 2016లో విజేతగా నిలిచిన ఏంజెలిక్ కెర్బర్.. మరుసటి ఏడాది నవోమి ఒసాకా చేతిలో తొలి రౌండ్లోనే చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఇక 40వ ర్యాంకర్ అయిన అలిజా కార్నెట్ రికార్డు స్థాయిలో 63వ గ్రాండ్‌స్లామ్ ఆడుతుండడం విశేషం. అయితే ఇప్పటివరకు క్వార్టర్స్ వరకు మాత్రమే వెల్లగలిగింది. అయితే ఈ సీజన్లో టాప్ 20లో ఉన్న ఆరుగురు క్రీడాకారిణులను ఓడించడం విశేషం. .@alizecornet is victorious in Armstrong! She defeats Raducanu, 6-3, 6-3 to advance to Round 2. pic.twitter.com/RHAd0zCBxv — US Open Tennis (@usopen) August 31, 2022 చదవండి: US Open 2022: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు -
Wimbledon 2022: కార్నెట్ సంచలనం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌లో ఫ్రాన్స్ అన్‌సీడెడ్ ప్లేయర్ అలైజ్ కార్నెట్ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను మూడో రౌండ్లోనే కంగు తినిపించింది. వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని టాప్‌సీడ్, టోర్నీ హాట్ ఫేవరెట్ జైత్రయాత్రకు ప్రపంచ 37వ ర్యాంకర్ కార్నెట్ బ్రేకులేసింది. శనివారం జరిగిన పోరులో ఆమె 6–4, 6–2తో అలవోక విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2005 నుంచి గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఫ్రాన్స్ వెటరన్ స్టార్ 2014లో కూడా ఇలాదే సెరెనా విలియమ్స్‌కు షాక్ ఇచ్చింది. అప్పటికే 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన టాప్‌సీడ్ సెరెనాను కార్నెట్ మూడో రౌండ్లో ఓడించింది. తాజా సంచలనంపై ఆమె మాట్లాడుతూ సెరెనా మ్యాచే గుర్తుకొచ్చిందని పేర్కొంది. మిగతా మ్యాచ్‌ల్లో 2018 వింబుల్డన్ చాంపియన్, 15వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 5–7తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓడగా, నాలుగో సీడ్ బడొసా (స్పెయిన్) 7–5, 7–6 (7/4)తో 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 11వ సీడ్ కొకొ గాఫ్ (అమెరికా)కు 6–7 (4/7), 6–2, 6–1తో 20వ సీడ్ అనిసిమోవా (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. 16వ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–1తో మగ్దలిన ఫ్రెచ్ (పోలండ్)పై నెగ్గింది. సెరెనాకు తొలిరౌండ్లోనే ఇంటిదారి చూపించిన హర్మొని టన్ (ఫ్రాన్స్) 6–1, 6–1తో బౌల్టర్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. -
పాపం కార్నెట్.. ఈసారి కూడా కల నెరవేరలేదు
ఫ్రెంచ్ వెటరన్ టెన్నిస్ ప్లేయర్ అలిజె కార్నెట్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న ఆమె కల.. కలగానే మిగిలిపోయింది. తన 17 ఏళ్ల కెరీర్లో ఒక గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన అలిజె కార్నెట్‌కు.. డేనియల్ కాలిన్స్ చేతిలో భంగపాటు ఎదురైంది. అమెరికాకు చెందిన డేనియల్ కాలిన్స్.. కార్నెట్‌ను 7-5,6-1తో వరుస సెట్లలో ఖంగుతినిపించి సెమీఫైనల్లో అడుగపెట్టింది. చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ ఇగా స్వియాటెక్, కాయ కనేపిల మధ్య జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ను విజయం వరించింది. మ్యాచ్‌లో 4-6,7-6(7/2),6-3 తేడాతో స్వియాటెక్.. కనేపిపై విజయం సాధించిన తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. మొత్తం మూడు గంటల ఒక నిమిషం పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన స్వియాటెక్ రెండో సెట్లో ఫుంజుకుంది. ఇక ఆఖరిసెట్లో 6-3తో గెలిచి సెమీస్‌కు చేరింది. ఇక ఇగా స్వియాటెక్, డేనియల్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. తొలి సెమీఫైనల్లో యాష్లే బార్టీ, కీస్ మాడిసన్లు తలపడనున్నారు. చదవండి: తొందర పడ్డానేమో! రిటైర్మెంట్పై సానియా మీర్జా వ్యాఖ్య -
'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ'
ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ రొమేనియాకు చెందిన సిమోనా హలెప్‌ను 6–4, 3–6, 6–4తో ఓడించి సంచలనం సృష్టించింది. అయితే మ్యాచ్ విజయం అనంతరం పోస్ట్ ఇంటర్య్వూలో కార్నెట్ ఎమోషనల్ అయింది. తనను ఇంటర్య్వూ చేసిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి జెలెనా డొకిక్కు మ్యాచ్ విజయాన్ని అంకితం చేసి ఆమెను హగ్ చేసుకొని ఏడ్చేయడం గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులను కంటితడి పెట్టించింది. చదవండి: Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు ''నేను క్వార్టర్స్‌కు చేరినందుకు మొదట నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ''డొకిక్ను ఉద్దేశించి..''.. నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. జీవితంలో నువ్వు ఎలా ముందుకెళ్లావో.. ఎంత ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. గాయాలతో కెరీర్‌ను అర్థంతరంగా ముగించినప్పటికి నువ్వు ఎంత గొప్ప ప్లేయర్ అనేది మాకు తెలుసు.. ఇప్పుడు కామెంటేటర్‌గా కూడా అంతే పేరు సంపాదిస్తున్నావు. ఈ విజయం నీకే అంకితం'' అంటూ చెప్పుకొచ్చింది. దీనికి బదులుగా డొకిక్ మాట్లాడుతూ.. ''నీ మాటలు నన్ను ఏడిపించేశాయి.. ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. థాంక్యూ'' అని పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకోవడంతో గ్యాలరీలోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్రొయేషియాకు చెందిన జెలెనా డొకిక్ వరుస గాయాల కారణంగా 2014లో 30 ఏళ్ల వయసున్నప్పుడు అర్థంతరంగా కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. అయితే ఇదే జెలెనా డొకిక్తో అలిజె కార్నెట్‌కు మంచి అనుబంధం ఉంది. ఆన్ కోర్టు.. ఆఫ్ కోర్టు ఇలా ఏదైనా అటు కెరీర్ గురించి.. ఆట గురించి మాట్లాడుకునేవారు. కార్నెట్ ఆటలో మెళుకువల కోసం జెలెనా సలహాలు చాలా తీసుకుంది. అలా తనపై విపరీతమైన అభిమానం పెంచుకున్న కార్నెట్.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ చేరడం.. విజయం అనంతరం తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి జెలెనా ఇంటర్య్వూ చేయడంతో ఎమోషన్‌ను ఆపుకోలేకపోయింది. చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం No dry eyes in the house 😭😭😭 This on-court interview between @alizecornet and Jelena Dokic is everything. #AusOpen · #AO2022 pic.twitter.com/F3nN0XSHNX — #AusOpen (@AustralianOpen) January 24, 2022 -
కార్నెట్ పట్టు వీడని పోరాటం
మెల్బోర్న్: ఏళ్ల తరబడి టెన్నిస్ ఆడుతున్నా అందరి కళ్లలో పడని ఫ్రాన్స్ స్టార్ అలిజె కార్నెట్ ఇప్పుడు ఒక్క ప్రిక్వార్టర్స్ విజయంతో పతాక శీర్షికల్లో నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 32 ఏళ్ల కార్నెట్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 15 ఏళ్ల ప్రాయంలో 2005 నుంచి గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడుతున్న ఈ ఫ్రాన్స్ స్టార్ గతంలో ఎప్పుడూ ప్రిక్వార్టర్స్ దశనే దాటలేకపోయింది. ఇప్పుడైతే ఏకంగా రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను కంగుతినిపించి మరీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కార్నెట్ 6–4, 3–6, 6–4తో హలెప్‌పై విజయం సాధించి తన 63వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. రెండో సీడ్ సబలెంకాకు షాక్ మరో ప్రిక్వార్టర్స్‌లో కూడా మరో అలుపెరగని క్రీడాకారిణి కయా కనెపి సంచలన విజయంతో క్వార్టర్స్ చేరింది. ఎస్తోనియాకు చెందిన 115వ ర్యాంకర్ కనెపి 5–7, 6–2, 7–6 (10/7)తో బెలారస్ స్టార్, రెండో సీడ్ సబలెంకాపై అద్భుత విజయం సాధించింది. 2007 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న కనెపి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కనెపి 15 ఏళ్ల కెరీర్లో మిగతా మూడు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో క్వార్టర్స్ చేరింది. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఈ ఏడాదే ఆ అవకాశం దక్కించుకుంది. మిగతా ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5–7, 6–3, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై, 27వ సీడ్ కొలిన్స్ (అమెరికా) 4–6, 6–4, 6–4తో 19వ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. చెమటోడ్చిన మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)కు అసాధారణ ప్రతిఘటన ఎదురైంది. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్ 6–2, 7–6 (7/4), 6–7 (4/7), 7–5తో 70వ ర్యాంకర్ మ్యాక్సిమ్ క్రెస్సీ (అమెరికా)పై గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–4, 4–6, 6–3, 6–4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, 11వ సీడ్ సినెర్ (ఇటలీ) 7–6 (7/3), 6–3, 6–4తో డి మినార్ (ఆస్ట్రేలియా)పై, తొమ్మిదో సీడ్ అలియాసిమ్ (కెనడా) 2–6, 7–6 (9/7), 6–2, 7–6 (7/4)తో సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. -
ఆట మధ్యలోనే షర్ట్ మార్చుకోవడంతో..
న్యూయార్క్:యూఎస్ ఓపెన్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ అనుకోకుండా చేసిన ఓ పని వివాదాస్పదమైంది. జొహన్నా లార్సన్ (స్వీడన్)తో సింగిల్స్ మ్యాచ్ మధ్యలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం కార్నెట్ పది నిమిషాలు విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్నెట్ చెమటతో తడిసిపోయిన తన షర్ట్‌ను కోర్టులోనే విప్పేసి మళ్లీ వేసుకుంది. దీన్ని గుర్తించిన చైర్ అంపైర్.. నిబంధనలు ఉల్లంఘించిందంటూ కార్నెట్‌ను హెచ్చరించారు. దాంతో వివాదం మొదలైంది. ఈ విషయాన్ని చైర్ అంపైర్ పెద్దదిగా చేసి చూపడాన్ని పలువురు టెన్నిస్ ప్లేయర్లు తప్పుబడుతున్నారు. మరొకవైపు అభిమానులు సైతం కార్నెట్‌కు అండగా నిలిచారు. ఉక్కపోతతో కార్నెట్ అలా చేసిందే కానీ.. ఉద్దేశపూర్వకంగా కాదు కదా అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా మండిపడుతున్నారు. మ్యాచ్ మధ్యలో పురుష క్రీడాకారులు షర్ట్ విప్పేస్తే లేని ఇబ్బంది.. క్రీడాకారిణుల విషయంలో మాత్రం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆమె కోర్టులో షర్ట్ మార్చుకున్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలగలేనప్పుడు రాద్దాంతం చేయడం అవసరం లేదని అంటున్నారు.