
ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ రొమేనియాకు చెందిన సిమోనా హలెప్‌ను 6–4, 3–6, 6–4తో ఓడించి సంచలనం సృష్టించింది. అయితే మ్యాచ్ విజయం అనంతరం పోస్ట్ ఇంటర్య్వూలో కార్నెట్ ఎమోషనల్ అయింది. తనను ఇంటర్య్వూ చేసిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి జెలెనా డొకిక్‌కు మ్యాచ్ విజయాన్ని అంకితం చేసి ఆమెను హగ్ చేసుకొని ఏడ్చేయడం గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులను కంటితడి పెట్టించింది.
చదవండి: Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు
''నేను క్వార్టర్స్‌కు చేరినందుకు మొదట నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ''డొకిక్‌ను ఉద్దేశించి..''.. నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. జీవితంలో నువ్వు ఎలా ముందుకెళ్లావో.. ఎంత ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. గాయాలతో కెరీర్‌ను అర్థంతరంగా ముగించినప్పటికి నువ్వు ఎంత గొప్ప ప్లేయర్ అనేది మాకు తెలుసు.. ఇప్పుడు కామెంటేటర్‌గా కూడా అంతే పేరు సంపాదిస్తున్నావు. ఈ విజయం నీకే అంకితం'' అంటూ చెప్పుకొచ్చింది. దీనికి బదులుగా డొకిక్ మాట్లాడుతూ.. ''నీ మాటలు నన్ను ఏడిపించేశాయి.. ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. థాంక్యూ'' అని పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకోవడంతో గ్యాలరీలోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక క్రొయేషియాకు చెందిన జెలెనా డొకిక్ వరుస గాయాల కారణంగా 2014లో 30 ఏళ్ల వయసున్నప్పుడు అర్థంతరంగా కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. అయితే ఇదే జెలెనా డొకిక్‌తో అలిజె కార్నెట్‌కు మంచి అనుబంధం ఉంది. ఆన్ కోర్టు.. ఆఫ్ కోర్టు ఇలా ఏదైనా అటు కెరీర్ గురించి.. ఆట గురించి మాట్లాడుకునేవారు. కార్నెట్ ఆటలో మెళుకువల కోసం జెలెనా సలహాలు చాలా తీసుకుంది. అలా తనపై విపరీతమైన అభిమానం పెంచుకున్న కార్నెట్.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ చేరడం.. విజయం అనంతరం తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి జెలెనా ఇంటర్య్వూ చేయడంతో ఎమోషన్‌ను ఆపుకోలేకపోయింది.
చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం
No dry eyes in the house 😭😭😭
— #AusOpen (@AustralianOpen) January 24, 2022
This on-court interview between @alizecornet and Jelena Dokic is everything. #AusOpen · #AO2022 pic.twitter.com/F3nN0XSHNX