Australian Open 2023: Daniil Medvedev Angrily Swears At Fan Video Goes Viral - Sakshi
Sakshi News home page

Daniil Medvedev: షార్ట్‌ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం

Jan 17 2023 12:44 PM | Updated on Jan 17 2023 1:09 PM

Australian Open 2023: Daniil Medvedev Angrily Swears-Fan-Video-Viral - Sakshi

రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌.. ఎనిమిదో సీడ్‌ డానిల్‌ మెద్వదెవ్‌ తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఆడుతున్న మెద్వదెవ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఒక అభిమానిపై తిట్ల దండకం అందుకున్నాడు. విషయంలోకి వెళితే.. షార్ట్‌ టెంపర్‌కు మారుపేరుగా నిలిచిన మెద్వదెవ్‌  అప్పటికే  రెండు సెట్లలో విజయం సాధించి దూకుడు మీద ఉన్నాడు. ఇక మూడో సెట్‌లోనూ 5-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న మెద్వదెవ్‌ సర్వీస్‌ మిస్‌ చేశాడు.

ఇది గమనించిన ఒక అభిమాని కోర్టులోకి వచ్చి బంతిని మెద్వదెవ్‌ వైపు విసిరాడు. దీంతో సహనం కోల్పోయిన మెద్వదెవ్‌ అతనివైపు కోపంగా చూస్తూ రష్యన్‌ భాషలో బూతు పదం తిట్టాడు. మెద్వదెవ్‌ చర్య అక్కడి మైక్రోఫోన్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో చైర్‌ అంపైర్‌ మెద్వదెవ్‌ను మందలించి అభిమానికి క్షమాపణ చెప్పాలని కోరాడు. అంపైర్‌కు ఏం జవాబివ్వకుండానే మ్యాచ్‌ను కొనసాగించిన మెద్వదెవ్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత అభిమానికి క్షమాపణ చెప్పడం కొసమెరుపు.

 ఇక మెద్వదెవ్‌ దురుసుగా ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు. 2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ సందర్భంగా అభిమానులతో పాటు చైర్‌ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  మ్యాచ్‌కు హాజరైన అభిమానులను ఇడియట్స్‌ అని.. వాళ్లవన్నీ ఖాళీ బ్రెయిన్స్‌ అని తిట్టిపోశాడు. అటుపై చైర్‌ అంపైర్‌ను కూడా దూషించాడు. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన మార్కోస్‌ గిరోన్‌పై 6-0, 6-1, 6-2తో వరుస సెట్లలో కంగుతినిపించిన మెద్వదెవ్‌ రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. 

చదవండి: సంచలనం.. మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌కు బిగ్‌షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement