న్యూయార్క్:యూఎస్ ఓపెన్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ అనుకోకుండా చేసిన ఓ పని వివాదాస్పదమైంది. జొహన్నా లార్సన్ (స్వీడన్)తో సింగిల్స్ మ్యాచ్ మధ్యలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం కార్నెట్ పది నిమిషాలు విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్నెట్ చెమటతో తడిసిపోయిన తన షర్ట్‌ను కోర్టులోనే విప్పేసి మళ్లీ వేసుకుంది. దీన్ని గుర్తించిన చైర్ అంపైర్.. నిబంధనలు ఉల్లంఘించిందంటూ కార్నెట్‌ను హెచ్చరించారు. దాంతో వివాదం మొదలైంది. ఈ విషయాన్ని చైర్ అంపైర్ పెద్దదిగా చేసి చూపడాన్ని పలువురు టెన్నిస్ ప్లేయర్లు తప్పుబడుతున్నారు. మరొకవైపు అభిమానులు సైతం కార్నెట్‌కు అండగా నిలిచారు.
ఉక్కపోతతో కార్నెట్ అలా చేసిందే కానీ.. ఉద్దేశపూర్వకంగా కాదు కదా అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా మండిపడుతున్నారు. మ్యాచ్ మధ్యలో పురుష క్రీడాకారులు షర్ట్ విప్పేస్తే లేని ఇబ్బంది.. క్రీడాకారిణుల విషయంలో మాత్రం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆమె కోర్టులో షర్ట్ మార్చుకున‍్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలగలేనప్పుడు రాద్దాంతం చేయడం అవసరం లేదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment